ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే ధ్యేయం

ABN , First Publish Date - 2022-10-01T05:47:09+05:30 IST

ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే ధ్యేయం

ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే ధ్యేయం
చెక్కులు అందజేస్తున్న ఎంపీ రాములు

ఆమనగల్లు/యాచారం, సెప్టెంబర్‌ 30: ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణకు పెద్దపీట వేస్తోందని నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ సభ్యుడు పోతుగంటి రాములు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డిలు అన్నారు. ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, కడ్తాల మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా రూ.1.05లక్షలు మంజూరయ్యాయి. శుక్రవారం ఆమనగల్లు పట్టణంలో బాధితకుటుంబాలకు ఎంపీ, ఎమ్మెల్సీలు చెక్కులు అందజేశారు. యాచారం మండల కేంద్రానికి చెందిన బి.అంజయ్యకు సీఎంఆర్‌ఎఫ్‌ కింద మంజూరైన రూ.27వేల చెక్కును ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అందజేశారు. 

Read more