చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం

ABN , First Publish Date - 2022-03-23T04:58:08+05:30 IST

చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం

చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం

ఘట్‌కేసర్‌, మార్చి 22 : చలివేంద్రం ఏర్పాటు అభినందనీయమని, బాటసారులు దాహార్తిని తీర్చేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఘట్‌కేసర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పావనీ జంగయ్యయాదవ్‌ అన్నారు. మంగళవారం ఘట్‌కేసర్‌లోని ఆర్టీసీ బస్‌స్టేషన్‌ వద్ద జనచైతన్య సేవాసమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేద్రంను ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఎండల తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతున్నదని, నిత్యం పరిసర గ్రామాల నుంచి ఘట్‌కేసర్‌ పట్టణానికి వివిధ పనుల కోసం ప్రజలు వస్తుంటారని, వారి దాహార్తిని తీర్చడానికి ఇలాంటి చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగ పడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్‌ మాధవరెడ్డి, మాజీ సర్పంచ్‌ యాదగిరి, కౌన్సిలర్లు మల్లేష్‌, నర్సింగ్‌రావు, జహంగీర్‌, రవీందర్‌, ఆర్టీసీ అధికారులు, రాజశేఖర్‌, అంజిరెడ్డి స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-23T04:58:08+05:30 IST