విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి
ABN , First Publish Date - 2022-08-10T06:15:44+05:30 IST
విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి

చేవెళ్ల, ఆగస్టు 9 : కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.ప్రభులింగం, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రామస్వామి డిమాండ్ చేశారు. మంగళవారం చేవెళ్లలో హైదరాబాద్-బీజాపూర్ రహదారిపై కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపేందుకే పార్లమెంట్లో విద్యుత్ బిల్లులు ప్రవేశ పెట్టిందన్నారు. పేదలకు, రైతులకు సబ్సిడీని తొలగిస్తుందన్నారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్ర కుట్రపన్నుతోందని మండిపడ్డారు. కార్యక్రమంలో నాయకులు సత్తిరెడ్డి, సురధీర్, ఎం.సుధాకర్‌గౌడ్, చంద్రయ్య, మల్లేశ్, నరేశ్, కృష్ణగౌడ్, జలీల్, మంజుల, మాధవి, జయమ్మ, లక్ష్మి, స్వరూప, సత్తమ్మ ఉన్నారు.