గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యం
ABN , First Publish Date - 2022-05-27T05:30:00+05:30 IST
గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యం

కందుకూరు, మే 27: గుర్తు తెలియని వ్యక్తి శవం లభ్యమైన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. బైరాగిగూడ రోడ్డు పక్కన శవం ఉం దని స్థానికులు పోలీసులకు సమా చారం ఇచ్చారు. ఎస్సై నరేష్ చేరుకొని పరిశీలించారు. మృతుడి వయసు 30-32ఏళ్లు ఉంటుందని, నీలి బనియన్ ధరించాడన్నారు. కుడి చేతిపై స్టార్ గుర్తు, ఎడమ చేతికి రెండు గీతలు పచ్చ బొట్లు ఉన్నాయన్నారు. మృతుడు హిందువుగా భావిస్తున్నామని తెలిపారు. శవాన్ని పోస్టు మార్టం కోసం ఉస్మానియ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. ఎవరైనా గుర్తుపడితే 9490617237 లేదా 7901104952/ 83339 93285 నెంబర్లకు ఫోన్ చేయాలని ఎస్సై పేర్కొన్నారు.