బాపూజీ మార్గం అనుసరణీయం

ABN , First Publish Date - 2022-01-31T04:44:46+05:30 IST

బాపూజీ మార్గం అనుసరణీయం

బాపూజీ మార్గం అనుసరణీయం
ఆమనగల్లులో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న నాయకులు

  • గాంధీ వర్ధంతి వేడుకలో ప్రజాప్రతినిధులు, అధికారులు


ఆమనగల్లు/తలకొండపల్లి/కడ్తాల్‌/కేశంపేట/షాద్‌నగర్‌/కొత్తూర్‌/యాచారం/కందుకూరు/ఇబ్రహీంపట్నం, జనవరి 30: బాపూజీ సిద్దాంతాలు, అహింస మార్గం అందరికీ అనుసరణీయమని ఆమనగల్లు మున్సిపల్‌ చైర్మన్‌ రాంపాల్‌ నాయక్‌, వైస్‌చైర్మన్‌ రాంపాల్‌ నాయక్‌, వైస్‌చైర్మన్‌ దుర్గయ్య, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కండె హరిప్రసాద్‌లు అన్నారు. పట్టణంలో గాంధీజీ 73వ వర్ధంతిని ఆదివారం జిల్లా ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడు వీరబొమ్మ రామ్మోహన్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆసుపత్రుల్లో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గోరటి నర్సింహా, చెన్నకేశవులు, చంద్రశేఖర్‌, బికుమాండ్ల నర్సింహా, కండె పాండు రంగయ్య, కొరివి వెంకటయ పాల్గొన్నారు. తలకొండపల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు గుజ్జల మహేశ్‌ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. డీసీసీ ఉపాఽధ్యక్షుడు భగవాన్‌రెడ్డి, అంజయ్య, కండె ఓంకారం, డోకూరు ప్రభాకర్‌రెడ్డి, కృష్ణ, అజీం, జనార్దన్‌ రెడ్డి పాల్గొన్నారు. కడ్తాల మండల కేంద్రంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు యాట నర్సింహ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివా్‌సరెడ్డి, యాట నర్సింహ, చేగూరి వెంకటేశ్‌, గురిగళ్ల లక్ష్మయ్య, రాంచందర్‌, మల్లేశ్‌గౌడ్‌, సత్యం యాదవ్‌, ఇమ్రాన్‌,పూల శంకర్‌ పాల్గొన్నారు. మైసిగండిలో ఎంపీపీ కమ్లీమోత్యనాయక్‌ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. కేశంపేట మండల కేంద్రంలో షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. షాద్‌నగర్‌ పట్టణంలో మున్సిపల్‌ చైర్మన్‌ నరేందర్‌, వాసవీక్లబ్‌ ఆధ్వర్యంలో జానంపేట ముఖ్య కూడలిలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మున్సిపల్‌ కౌన్సిలర్లు సర్వర్‌పాషా, శ్రీనివాస్‌, కానుగు అనంతయ్య, సర్పంచులు తలసాని వెంకట్‌రెడ్డి, నవీన్‌కుమార్‌, జడ్పీటీసీ తాండ్ర విశాలశ్రావణ్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ జగదీశ్వర్‌గౌడ్‌, ఎంపీటీసీ మల్లే్‌షయాదవ్‌, మార్కెట్‌కమిటీ వైస్‌చైర్మన్‌ నారాయణరెడ్డి, నాయకులు మురళీధర్‌రెడ్డి పాల్గొన్నారు.  కొత్తూర్‌ మున్సిపాలిటీలోని తిమ్మాపూర్‌ వద్ద టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు బాతుక దేవేందర్‌యాదవ్‌, మున్సిపల్‌ వైస్‌ఛైర్మన్‌ డోలీ రవీందర్‌, కౌన్సిలర్‌ కోస్గి శ్రీనివాస్‌, మాదారం నర్సింహాగౌడ్‌, ఎంపీటీసీ చింతకింది రాజేందర్‌గౌడ్‌, నాయకులు యాదయ్య, గోపాల్‌గౌడ్‌ తదితరులు నివాళులర్పించారు. యాచారంలో యాచారం, నందివనపర్తి, మాల్‌ గ్రామాల్లో పలువురు ఆ ర్యవైశ్యసంఘ అధ్యక్షుడు వి.శ్రీనివా్‌సగుప్త నివాళులర్పించారు. కందుకూరులో తెలంగాణ హ్యూమన్‌రైట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు టి.ఆంజనేయులు, ఆర్యవైశ్యసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కుంచకూరి వెంకటేశ్వర్లుగుప్తలు నివాళులర్పించారు. నాయకులు కుంచకూరి సత్యనారాయణగుప్త, దాచపల్లి రఘుబాబు పాండురంగారెడ్డి, వెంకటరమణ, సుశీల్‌, నేదునూరు మాజీ ఎంపీటీసీ కె.బాల్‌రాజ్‌ పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నంలో టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి  ఆయన క్యాంపు కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మండల వైస్‌చైర్మన్‌ మంచిరెడ్డి వెంకటప్రతా్‌పరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, సత్తు వెంకటరమణారెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కప్పరి స్రవంతి, వైస్‌చైర్మన్‌ ఆకుల యాదగిరి, రాజు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-31T04:44:46+05:30 IST