‘ఈద్గా ఘటన’ నిందితులను గుర్తించాలి
ABN , First Publish Date - 2022-12-15T00:21:15+05:30 IST
ఈద్గా వద్ద గదికి నిప్పంటించిన ఘటనలో నిందితులను గుర్తించాలని వికారాబాద్ జిల్లా ఎస్పీని ఈద్గా చైర్మన్ యూసుఫ్ ఖాన్ కోరారు.
తాండూరు రూరల్, డిసెంబరు, 14 : ఈద్గా వద్ద గదికి నిప్పంటించిన ఘటనలో నిందితులను గుర్తించాలని వికారాబాద్ జిల్లా ఎస్పీని ఈద్గా చైర్మన్ యూసుఫ్ ఖాన్ కోరారు. తాండూరు మండల పరిధిలోని చెనిగే్‌షపూర్ ఈద్గా వద్ద నాలుగు నెలల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు ఓ గదికి నిప్పంటించడంతో అందులోని వస్తువులు కాలిపోయాయి. దీంతో నిందితులను గుర్తించాలని ఈద్గా చైర్మన్ యూసుఫ్‌ఖాన్ బుధవారం ఎస్పీ కోటిరెడ్డిని కలిసి విన్నవించారు. తగిన చర్యలు తీసుకుని నిందితులను శిక్షించాలని వినతిపత్రం అందజేశారు. ఎస్పీని కలిసినవారిలో మహ్మద్ కైజర్, ఫక్రొద్దీన్, మోసిన్‌ఖాన్, ఇమ్రాన్‌ఖాన్ తదితరులు ఉన్నారు.