తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం

ABN , First Publish Date - 2022-09-30T05:24:11+05:30 IST

తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం

తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం
చేవెళ్ల: మాల్కాపూర్‌ గ్రామంలో చీరలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కాలె యాదయ్య

చేవెళ్ల/శంకర్‌పల్లి/షాబాద్‌/మొయినాబాద్‌/షాద్‌నగర్‌ రూరల్‌/కేశంపేట/కందుకూరు/ఆమనగల్లు, సెప్టెంబరు 29: తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్ల మండల పరిధిలోని మాల్కాపూర్‌, కుమ్మెర, తంగడ్‌పల్లి, కేసారం తదితర గ్రామాల్లో బతుకమ్మ కానుకలు, ఆసరా పింఛన్లను ఎమ్మెల్యే గురువారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఎం.మాలతికృష్ణరెడ్డి, ఎంపీపీ ఎం.విజయలక్ష్మి రమణారెడ్డి, వైఎస్‌ ఎంపీపీ కర్నె శివప్రసాద్‌ పాల్గొన్నారు. అదేవిధంగా శంకర్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఆశావర్కర్లకు డ్రెస్‌కోడ్‌ చీరలను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి ప్రవీణ్‌కుమార్‌, ఎంపీపీ గోవర్దన్‌రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ పాల్గొన్నారు. అదేవిధంగా మండలంలోని దొంతాన్‌పల్లి సర్పంచ్‌ అశ్విని సుధాకర్‌ దొంతాన్‌పల్లి, గోపులారం, మిర్జాగూడ, ప్రొద్దటూర్‌ గ్రామాల్లో ఎంపీడీవో వెంకయ్యతో  కలిసి మహిళలకు బతుకమ్మ కానుకలను అందజేశారు. మున్సిపాలిటీ పరిధిలో జాగృతి డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు.  కరస్పాండెంట్‌ డీఎస్‌ రాజు, ప్రిన్సిపాల్‌ షణ్ముక్‌, డైరెక్టర్‌ విజయలక్ష్మి, దీప, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. అదేవిధంగా షాబాద్‌ మండలం మద్దెంగూడలో సర్పంచ్‌ కుర్వ జయమ్మ సుదర్శన్‌, ఉపసర్పంచ్‌ సామ ప్రతా్‌పరెడ్డిలు మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అదేవిధంగా మొయినాబాద్‌లోని చిలుకూరు గ్రామంలో ఎంపీపీ నక్షత్రం మహిళలకు బతుకమ్మ చీరలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సంధ్య, గ్రామ కార్యదర్శి వెంకటేశ్‌ పాల్గొన్నారు. అదేవిధంగా ఫరూఖ్‌నగర్‌ మండలం బూర్గుల గ్రామంలో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.  అదేవిధంగా మధురాపూర్‌, గంట్లవెల్లి గ్రామాల్లో ఎంపీపీ ఖాజా ఇద్రీస్‌, జడ్పీటీసీ వెంకట్‌రాంరెడ్డి చీరలు పంపిణీ చేశారు.  అదేవిధంగా కేశంపేట మండలంలోని పాపిరెడ్డిగూడ, ఇప్పలపల్లి, పోమాల్‌పల్లి, కొండారెడ్డిపల్లి, చింతకుంటపల్లి, వేముల్‌నర్వ గ్రామాల్లో ఎంపీపీ రవీందర్‌ యాదవ్‌ బతుకమ్మ చీరలను మహిళలకు పంపిణీ చేశారు. కాగా కేశంపేట జడ్పీటీసీ తాండ్ర విశాల మూడు రోజులుగా వివిధ రంగుల బతుకమ్మ చీరను కట్టుకుని సందడి చేస్తున్నారు. అదేవిధంగా కందుకూరు మండలంలోని నేదునూరులో వైస్‌ఎంపీపీ గంగుల శమంత ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్‌ కాసుల రామకృష్ణారెడ్డితో కలిసి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.  పులిమామిడి, దాసర్లపల్లి గ్రామాల్లో సర్పంచులు వత్తుల అనీతాశ్రీనివాస్‌, పి.బాలమణిఅశోక్‌లు మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఎంపీటీసీ టి.ఇందిరదేవేందర్‌, నాయకులు వెంకటాచారి, బి.శ్రీనివాస్‌, నర్సింహ పాల్గొన్నారు. అదేవిధంగా ఆమనగల్లు మండలం శెట్టిపల్లి గ్రామంలో టీఆర్‌ఎస్‌ యువజన విభాగం మండల అధ్యక్షుడు ఎగిరిశెట్టి సత్యం, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పోనుగోటి అర్జున్‌ రావు , సర్పంచ్‌ గోదాదేవిలు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఉపసర్పంచ్‌ వెంకటయ్య, పంచాయతీ కార్యదర్శి లక్ష్మణ్‌, నాయకులు వెంకటయ్య, జగదీశ్వర్‌, వెంకటేశ్వర్లు, జంగయ్య పాల్గొన్నారు.  చెన్నంపల్లి గ్రామంలో ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో  మార్కెట్‌ చైర్మన్‌ నాలాపురం శ్రీనివా్‌సరెడ్డి, వైస్‌చైర్మన్‌ గిరియాదవ్‌, ఎంపీపీ అనితవిజయ్‌, జడ్పీటీసీ అనురాధపత్యనాయక్‌ పాల్గొన్నారు. 

Read more