-
-
Home » Telangana » Rangareddy » Telangana is the ideal of the country-MRGS-Telangana
-
దేశానికే తెలంగాణ ఆదర్శం
ABN , First Publish Date - 2022-03-05T05:30:00+05:30 IST
దేశానికే తెలంగాణ ఆదర్శం

ఆమనగల్లు, మార్చి 5: దేశంలో మరేరాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం మహిళల సంక్షేమం, రక్షణ, అభివృద్ధి కోసం వివిద పథకాలు రూపొందించి అమలు చేస్తోందని టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివా్‌సరెడ్డి అన్నారు. పట్టణంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోలి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 6 నుంచి 8వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళాబంధు సంబురాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో మార్కెట్ డైరెక్టర్లు సురమల్ల సుభాష్, రమేశ్ నాయక్, తలకొండపల్లి మండల టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్‌రెడ్డి, ఆమనగల్లు మండల టీఆర్‌ఎస్ రైతు విభాగం అధ్యక్షుడు రూపం వెంకట్‌రెడ్డి, నాయకులు వడ్డేమోని శివకుమార్, రవికుమార్, సాయినాథ్‌రెడ్డి, చలిచీమల సతీశ్ తదితరులు పాల్గొన్నారు.