టీడీపీ బహిరంగ సభను జయప్రదం చేయాలి

ABN , First Publish Date - 2022-12-16T00:07:12+05:30 IST

ఖమ్మంలో ఈనెల 21న నిర్వహించే టీడీపీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు సుభాష్‌ యాదవ్‌ తెలిపారు.

టీడీపీ బహిరంగ సభను జయప్రదం చేయాలి

చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు సుభాష్‌ యాదవ్‌

వికారాబాద్‌, డిసెంబరు 15 : ఖమ్మంలో ఈనెల 21న నిర్వహించే టీడీపీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు సుభాష్‌ యాదవ్‌ తెలిపారు. గురువారం ఎన్టీఆర్‌ భవన్‌లో చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధి ముఖ్య నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభకు బయలు దేరే ముందు ఆయా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి, ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించాలని కోరారు. ప్రతీ నియోజకవర్గం నుంచి ఉదయం భారీ ఎత్తున నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్‌ భవన్‌కు తరలిరావాలని తెలిపారు. కాగా, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో కలిసి హైదరాబాద్‌ నుంచి సభకు బయలుదేరాల్సి ఉంటుందని ఆయన సూచించారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు పి.చంద్రయ్య, ధనలక్ష్మి, అధికార ప్రతినిధి రామేశ్వర్‌రావు, పార్టీ పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శులు కొమ్మిడి వెంకట్‌రెడ్డి, బేతి జగదీశ్‌రెడ్డి, కుర్ర మహేష్‌, వికారాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి దివాకర్‌, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి కట్టా వెంకటేశ్‌గౌడ్‌, వెంకటేశ్వర్లు, ఎస్‌ఎస్‌ రాజు, సుభాన్‌గౌడ్‌, శేఖర్‌యాదవ్‌, మాణిక్యం, లక్ష్మీనర్సమ్మ, ఐలేష్‌యాదవ్‌, శివగౌడ్‌, సిరాజొద్దీన్‌, శ్రీకాంత్‌, సాంబశివుడు, పాపిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T00:07:13+05:30 IST