పన్నులు సకాలంలో చెల్లించాలి
ABN , First Publish Date - 2022-12-07T23:44:26+05:30 IST
పన్నులు సకాలంలో చెల్లించాలని, లేనియెడల మొండి బకాయి దారులకు రెడ్ నోటీసులు జారీ చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నామని పోచారం మున్సిపల్ కమిషనర్ సురేష్ తెలిపారు.
ఘట్‌కేసర్, డిసెంబరు 7 : పన్నులు సకాలంలో చెల్లించాలని, లేనియెడల మొండి బకాయి దారులకు రెడ్ నోటీసులు జారీ చేసి కఠిన చర్యలు తీసుకుంటున్నామని పోచారం మున్సిపల్ కమిషనర్ సురేష్ తెలిపారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్యాపార సంస్థల నిర్వాహకులకు రెడ్ నోటీసులు జారీ చేశారు. నారపల్లిలోని హెచ్‌పీ పెట్రోల్ బంకు యాజమాన్యం రెండు సంవత్సరాలుగా ఆస్తి పన్ను చెల్లించకుండా కాలయాపన చేస్తోంది. అదేవిధంగా కనీసం ట్రేడ్ లైసెన్స్ కూడా తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో బంకును సీజ్ చేసినట్లు ఆయన చెప్పారు. దీంతో రూ.2.9లక్షలు బంక్ యాజమాన్యం చెల్లించినట్లు తెలిపారు. అలాగే రావీస్ పాఠశాల యాజమాన్యానికి నోటీసులు జారీ చేయడంతో 3.74లక్షలు చెల్లించినట్లు వివరించారు. మున్సిపాలిలిటీ పరిధిలో పన్నులు చెల్లించకుండా మొండిగా వ్యవరిస్తున్న వ్యాపార సంస్థలకు రెడ్ నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుటామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో మేనేజర్ నర్సింహులు, సిబ్బంది పాల్గొన్నారు.