ఆమనగల్లు మున్సిపాలిటీకి స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2022 అవార్డు

ABN , First Publish Date - 2022-11-24T23:13:42+05:30 IST

ఆమనగల్లు మున్సిపాలిటీ స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022 అవార్డుకు ఎంపికైంది.

ఆమనగల్లు మున్సిపాలిటీకి స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2022 అవార్డు
కమిషనర్‌ శ్యామ్‌సుందర్‌ను సత్కరిస్తున్న పాలకవర్గం

ఆమనగల్లు , నవంబరు 24: ఆమనగల్లు మున్సిపాలిటీ స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022 అవార్డుకు ఎంపికైంది. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ, స్వచ్ఛభారత్‌ మిషన్‌ జాయింట్‌ సెక్రటరీ రూపామిశ్రా నుంచి గురువారం మున్సిపాలిటీకి ఉత్తర్వులు అందాయి. పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణలో వేగవంతంగా ప్రగతి సాధించినందుకు కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డుకు ఎంపిక చేసింది. దేశవ్యాప్తంగా 25వేల నుంచి 50వేల జనాభా కలిగిన 50 మున్సిపాలిటీలను స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కేటగిరీల వారీగా విభజించింది. ఇందులో భాగంగా ఆమనగల్లు మున్సిపాలిటీకి 2వ కేటగిరిలో స్థానం లభించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు మున్సిపాలిటీలను స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుకు ఎంపిక చేయగా రంగారెడ్డి జిల్లా నుంచి ఆమనగల్లు మున్సిపాలిటీ ఎంపికైంది. ఆమనగల్లు మున్సిపాలిటీ అవార్డుకు ఎంపిక కావడం పట్ల మున్సిపల్‌ చైర్మన్‌ రాంపాల్‌నాయక్‌, వైస్‌ చైర్మన్‌ దుర్గయ్య, కౌన్సిలర్లు హర్షం వ్యక్తం చేశారు. మున్సిపల్‌ కార్యాలయంలో గురువారం కమిషనర్‌ శ్యామ్‌సుందర్‌ను పాలకవర్గం సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కృష్ణ, విక్రమ్‌రెడ్డి, సభావట్‌ సుజాతరాములు, చెక్కాల లక్ష్మణ్‌, తల్లోజు విజయ్‌కృష్ణ, సోనిజయరామ్‌, మేడిశెట్టి శ్రీధర్‌, చెన్నకేశవులు, యాదమ్మ, దివ్యశ్రీకాంత్‌ సింగ్‌, జ్యోతినర్సింహ్మ,యాదమ్మశ్రీశైలం యాదవ్‌,కమటం రాధమ్మవెంకటయ్య, మేనేజర్‌ సతీష్‌, సిబ్బంది రవి, సత్యనారాయణ, ఎల్లయ్య, దామోదర్‌, రవి, రామకృష్ణ, షర్పద్దీన్‌, దశరథ్‌, సుభాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T23:13:42+05:30 IST

Read more