-
-
Home » Telangana » Rangareddy » Students should study hard-MRGS-Telangana
-
విద్యార్థులు పట్టుదలతో చదవాలి
ABN , First Publish Date - 2022-09-08T05:30:00+05:30 IST
విద్యార్థులు పట్టుదలతో చదవాలి

ఆమనగల్లు, సెప్టెంబరు 8: విద్యార్థులు పట్టుదలతో చదివి జీవితంలో ఉన్నతంగా రాణించాలని తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్ అన్నారు. వెల్దండ మోడల్ స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వెయ్యి మంది విద్యార్థులకు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు భూపతిరెడ్డి, ఎంపీపీ నిర్మలశ్రీశైలం గౌడ్, నాయకులు జ్యోతయ్య, బుచ్చిబాబు, దేవులా, జంగయ్య, సుశీల, పూరి రమేశ్, రాఘవేందర్, ప్రీన్సిఫల్ పుష్పలత, హెచ్‌ఎం అంజయ్య పాల్గొన్నారు. అదేవిధంగా వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన వెంకటనారాయణ ఇంటి నిర్మాణానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేయూతనందించారు. ఈ కార్యక్రమంలో మొకురాల అశోక్‌గౌడ్, కొండల్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.