విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి

ABN , First Publish Date - 2022-09-08T05:54:35+05:30 IST

విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి

విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి

షాద్‌నగర్‌రూరల్‌/షాద్‌నగర్‌ అర్బన్‌, సెప్టెంబరు 7: విద్యార్థులు  బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని మున్నూరు కాపు సంఘం షాద్‌నగర్‌ తాలుకా అధ్యక్షుడు మేడిగ పెంటయ్య అన్నారు. షాద్‌నగర్‌ నియోజక వర్గంలోని మున్నూరు కాపు విద్యార్థులకు  బుధవారం స్థానిక సాయిరాజా ఫంక్షన్‌ హాల్‌లో 216 మంది విద్యార్థులకు నోట్‌బుక్స్‌ను అందించారు. హైదరాబాద్‌లోని మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం సహకారంతో నోట్‌పుస్తకాలను పంపిణీ చేసినట్లు పెంటయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం నాయకులు సుంకరి బాలకృష్ణ, గంప చంద్రమోహన్‌, సుదర్శన్‌, మంచిరేవుల సాయికృష్ణ,  గుండు నారాయణ, ఈ.శ్రీనివాస్‌, గంధం ఆనంద్‌, చంద్రశేఖర్‌, అంజయ్య, బాలచందర్‌ పాల్గొన్నారు. అదేవిధంగా ఫరూఖ్‌నగర్‌ మండలం కాంసాన్‌పల్లి పాఠశాలలో  సర్పంచ్‌ బసిరెడ్డి పద్మ నరేందర్‌రెడ్డి విద్యార్థులకు యూనీఫాం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం పిలిప్స్‌, నాయకులు నర్సింలు, యిదయ్య, వెంకటయ్య, కుమార్‌, రవి,  కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.   

Read more