జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు విద్యార్థి ఎంపిక

ABN , First Publish Date - 2022-10-17T05:30:00+05:30 IST

జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు విద్యార్థి ఎంపిక

జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు విద్యార్థి ఎంపిక
సాయికుమార్‌

శామీర్‌పేట, అక్టోబరు 17: తూంకుంటలోని విజ్ఞాన భారతి పాఠశాలలో 8వ తరగతి విద్యార్థి, ఖోఖో క్రీడాకారుడు మజ్జి సాయికుమార్‌ 32వ జాతీయ స్థాయి సబ్‌జూనియర్‌ చాంపియన్‌షిప్‌ ఖోఖో పోటీలకు ఎంపికయ్యాడు. ఈ క్రీడా పోటీలు ఈ నెల 22 నుంచి మహారాష్ట్రలో నిర్వహిస్తారు. సోమవారం సాయికుమార్‌ను కరస్పాండెంట్‌ హన్మంతరెడ్డి, ప్రిన్సిపల్‌ జంగారెడ్డి, హెచ్‌ఎం గోనె సంగీత అభినందించారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కరస్పాండెంట్‌ అన్నారు.

Updated Date - 2022-10-17T05:30:00+05:30 IST