ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు
ABN , First Publish Date - 2022-12-15T00:33:35+05:30 IST
కళాశాల్లో విద్యార్ధులు ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీధర్‌కుమార్ తెలిపారు.
శంషాబాద్ రూరల్, డిసెంబరు 14: కళాశాల్లో విద్యార్ధులు ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీధర్‌కుమార్ తెలిపారు. చర్లగూడ ఐఎంటీ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ... యువత డ్రగ్స్‌కు బానిసవుతున్నారని, జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. ఇంటర్ ప్రథమ, ద్వితీ య సంవత్సరాల విద్యార్థులు ఎక్కువ మంది ర్యాగింగ్‌కు పాల్పడుతున్నట్టు తెలిసిందని, కొందరిపై కేసులు కూడా నమోదయ్యాయని తెలి పారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వారిపై నిఘా పెట్టాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఏసీపీ భాస్కర్‌గౌడ్, ఐఎంటీ కళాశాల డీన్ శరత్ తదితరులు పాల్గొన్నారు.