ఇసుక అక్రమ దందాపై ఉక్కుపాదం : ఎస్సై

ABN , First Publish Date - 2022-02-20T05:11:51+05:30 IST

ఇసుక అక్రమ దందాపై ఉక్కుపాదం : ఎస్సై

ఇసుక అక్రమ దందాపై ఉక్కుపాదం : ఎస్సై

దౌల్తాబాద్‌, ఫిబ్రవరి 19: అక్రమ ఇసుక దందాపై దౌల్తాబాద్‌ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎస్సై రమేశ్‌కుమార్‌ తెలిపిన వివరాల మేరకు.. ఉన్నతాధికారుల ఆదేశాలతో నెల రోజులుగా అక్రమంగా ఇసుక తరలిస్తున్న 16 ట్రాక్టర్ల యజమానులను, సంబంధిత వాహనాలను పోలీ్‌సస్టేషన్‌కు తరలించి చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. అదేవిధంగా దౌల్తాబాద్‌ తహసీల్దార్‌ సహకారంతో ఇసుక వ్యాపారులను బైండోవర్‌ చేయడం జరిగిందన్నారు. పీడీఎస్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు అక్రమంగా కలపను నరికివేసి వివిధ ప్రాంతాలకు తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.

Read more