ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి
ABN , First Publish Date - 2022-10-07T06:16:33+05:30 IST
ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి
కందుకూరు, అక్టోబరు 6: ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి అన్నారు. మండలంలోని కొత్తగూడ గ్రామంలో నూతనంగా నిర్మించనున్న శ్రీసత్యనారాయణ, రామలింగేశ్వర ఆలయ నిర్మాణానికి బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, బొక్క మాధవరెడ్డి, రంగారెడ్డి జిల్లా బీజేపీ పంచాయతీ సెల్ కన్వీనర్ సాధ మల్లారెడ్డి, ఎంపీటీసీ బొక్క జ్యోతిలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి చొరవతో మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో అనేక గ్రామాల్లో, నగర శివారుల్లో ఆలయాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు రాజుశర్మ, గ్రామస్థులు దామోదర్‌రెడ్డి, ఎల్లారెడ్డి, బాల్‌రెడ్డి, వెంకటే్‌షగౌడ్, దయాకర్‌రెడ్డి, లక్ష్మణాచారి, జి.యెల్లారెడ్డి, కృష్ణయ్య, సత్యనారాయణరెడ్డి, సంజీవరెడ్డి, నరేందర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.