మెడిసిన్‌ హబ్‌గా రాష్ట్రం

ABN , First Publish Date - 2022-12-07T23:20:19+05:30 IST

తెలంగాణ రాష్ట్రం మెడిసిన్‌ హబ్‌గా మారిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు.

మెడిసిన్‌ హబ్‌గా రాష్ట్రం
ఒడిసిస్‌ లాజిస్టిక్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి

శంషాబాద్‌, డిసెంబరు 7 : తెలంగాణ రాష్ట్రం మెడిసిన్‌ హబ్‌గా మారిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శంషాబాద్‌ విమానాశ్రయ కార్గో టెర్మినల్‌లో ప్రముఖ ట్రాన్స్‌పోర్టు సంస్థ ఒడిసిస్‌ లాజిస్టిక్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కార్యాలయాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం సీడ్‌బౌల్‌గా, ఫార్మాహబ్‌గానూ మారిందన్నారు. హైదరాబాద్‌ నగరం భౌగోళికంగా అన్నిరకాల వ్యాపారాలకూ అనువుగా ఉందన్నారు. దేశంలోని ఫార్మాస్యుటికల్‌ రంగంలో తెలంగాణలోనే మూడోవంతు కేంద్రీకృతమైందన్నారు. శంషాబాద్‌ విమానాశ్రయం అన్ని ప్రాంతాలకూ కనెక్టివిటీ ఉండటం వ్యాపారాలకు కలిసివచ్చే అంశమన్నారు. ఒడిసిస్‌ లాజిస్టిక్స్‌ పూర్తిగా మెడిసిన్‌ ట్రాన్స్‌పోర్టు కోసం వినియోగిస్తామని సంస్థ ఎండీ అభిషేక్‌ఠాకూర్‌ ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T23:20:20+05:30 IST