దుర్గామాతకు ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2022-09-27T05:30:00+05:30 IST

దుర్గామాతకు ప్రత్యేక పూజలు

దుర్గామాతకు ప్రత్యేక పూజలు
ఘట్‌కేసర్‌ : గాయత్రీదేవీ అలంకారంలో అమ్మవారు

తాండూరు/కొడంగల్‌ రూరల్‌/కులకచర్ల/పరిగి/శామీర్‌పేట/వికారాబాద్‌, సెప్టెంబరు 27 : శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తాండూరు పట్టణం బసవన్న కట్ట వద్ద ప్రతిష్ఠించిన దుర్గామాతను తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డిలు వేర్వేరుగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వీరివెంట మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న, వైస్‌ చైర్‌పర్సన్‌ దీపా నర్సింహులు, కౌన్సిలర్‌ సంగీతాఠాగూర్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విఠల్‌నాయక్‌, నాయకులు శ్రీనివాసాచారి, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. కొడంగల్‌ మండల పరిధిలోని హస్నాబాద్‌లో సర్పంచ్‌ బి.పకీరప్ప ఆధ్వర్యంలో భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం దుర్గమాత గాయత్రీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

కులకచర్ల మండలం పాంబండ ఆలయంలో అమ్మవారు బాలాత్రిపుర సుందరీదేవి రూపంలో దర్శనమిచ్చారు. అమ్మవారి మండపంలో వేదబ్రాహ్మణులు అనంతమయ్య, పాండుశర్మలు హోమం నిర్వహించారు. నవరాత్రుల్లో భాగంగా పాంబండపై అమ్మవారి మండపంలో నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొంటున్నారు. అదేవిధంగా పరిగి మునిసిపల్‌ పరిధిలోని మైసమ్మ ఆలయంలో ప్రతిష్ఠంచిన దుర్గామాతకు మున్సిపల్‌ చైర్మన్‌ అశోక్‌ ప్రత్యేక పూజలు చేశారు. శామీర్‌పేటలోని శ్రీగాయత్రి మహాక్షేత్రంలో శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆలయ వ్యవస్థాపకులు డాక్టర్‌ ఎస్‌వీఎల్‌ఎన్‌ మూర్తి ఆధ్వర్యంలో వేదబ్రహ్మణుల మంత్రోశ్చరణల మధ్య పూజలు నిర్వహిస్తున్నారు. మంగళవారం అమ్మవారు కంచి కామాక్షీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.

ఉమ్మడి శామీర్‌పేట మండలంతో పాటు నగరానికి చెందిన భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అదేవిధంగా ఘట్‌కేసర్‌ మండలం పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలోని గాయత్రీ ఆలయంలో అమ్మవారు గాయత్రీదేవీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.


Read more