జిల్లా ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు
ABN , First Publish Date - 2022-04-10T04:51:28+05:30 IST
జిల్లా ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు
- వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి
వికారాబాద్ : వికారాబాద్ జిల్లా ప్రజలు ప్రశాంతంగా ఆనందంగా శ్రీ రామ నవమి పండుగను జరుపుకోవాలని, జిల్లా ప్రజలందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూసుకోవాలని, సోషల్ మీడియాలో వచ్చే వార్తల పట్ల అవేర్‌నెస్ కలిగి ఉండాలని ఈ సందర్భంగా ఎస్పీ కోరారు.