ప్రత్యామ్నాయం చూపండి మహాప్రభో!
ABN , First Publish Date - 2022-12-07T22:52:46+05:30 IST
మేడ్చల్ కలెక్టరేట్ ఎదుట బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంతాయిపల్లి భూ నిర్వాసితుల మహాధర్నా నిర్వహించారు.
మేడ్చల్ డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : మేడ్చల్ కలెక్టరేట్ ఎదుట బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంతాయిపల్లి భూ నిర్వాసితుల మహాధర్నా నిర్వహించారు. టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి సంఘీభావం తెలిపి మాట్లాడుతూ భూమిని కోల్పోయిన పేద రైతులకు అంతే సమానంగా భూమిని ఇవ్వాలని లేదా ఎకరాకు వెయ్యి గజాలు హెచ్‌ఎండీఏ లేఔట్ తరహాలో అభివృద్ది చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జైపాల్‌రెడ్డి, శంకర్‌గౌడ్, వైస్ ఎంపీపీ మంద శ్రీనివా్‌సరెడ్డి, సింగిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, చంద్రశేఖర్, మొగుళ్ల శ్రీనివా్‌సరెడ్డి, వెంకటేష్ పాల్గొన్నారు. కాగా అదే సమయంలో కలెక్టరేట్‌లో షీ క్యాబ్ వాహనాల పంపిణీ కార్యక్రమానికి వెళ్తున్న మంత్రి మల్లారెడ్డిని రైతులు ఘోరావ్ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ 2,3 రోజుల్లో పూర్తి వివరాలతో తన వద్దకు వస్తే 15 రోజుల్లో సమస్య పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు.