భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలి

ABN , First Publish Date - 2022-08-04T05:59:11+05:30 IST

భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలి

భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలి
కలెక్టర్‌ కార్యాలయం వద్ద రైతులు

కడ్తాల్‌, ఆగస్టు 3: తమ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించి ఆన్‌లైన్‌ చేసి పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని కడ్తాల మండలం అన్మా్‌సపల్లి, జమ్ములబావి తండా, పుల్లేరు బోడు తండా, సాయిరెడ్డి గూడెం రైతులు కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ను కోరారు. బుధవారం ఆయా గ్రామాల రైతులు కలెక్టరేట్‌ చేరుకొని తమ గోడును వెల్లబోసుకున్నారు. కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కడ్తాల రెవెన్యూ పరిధి సర్వే నెంబర్‌ 260/1, 260/5, 260/6, 260/7/8, 260/18/1, 260/18/2, 260/18/19, 260/46/ 260/47, 260/48, 260/28, 260/1, 260/20లలోని భూములను సాగు చేసుకుంటున్నామని తెలిపారు. ఆ భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని చెంచు గిరిజనులు కోరారు. తమ భూములను నిషేధిత జాబితాలో చేర్చడంత క్రయవిక్రయాలు నిలిచాయన్నారు. తమ భూములను వెంటనే ధరణ పోర్టల్‌లో నమోదు చేయాలని కలెక్టర్‌కు వచ్చిన వినతిపత్రం ఇచ్చారు. స్పందించిన కలెక్టర్‌ వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని సర్పంచ్‌ పోతుగంటి శంకర్‌ తెలిపారు.

Updated Date - 2022-08-04T05:59:11+05:30 IST