అయ్యప్ప నామస్మరణతో మార్మోగిన షాద్‌నగర్
ABN , First Publish Date - 2022-12-15T23:55:25+05:30 IST
షాద్‌నగర్ పట్టణం అయ్యప్ప స్వామి నామస్మరణ మార్మోగింది.
షాద్‌నగర్‌అర్బన్, డిసెంబరు 15: షాద్‌నగర్ పట్టణం అయ్యప్ప స్వామి నామస్మరణ మార్మోగింది. మహాపడిపూజను పురస్కరించుకుని గురువారం రాత్రి పరిగి రోడ్డులోని పోచమ్మ అలయం నుంచి కన్నెస్వాముల భారీ ర్యాలీ నిర్వహించారు. వందల మంది కన్నెస్వాములు దీపారాధనతో ర్యాలీలో పాల్గొని అయ్యప్ప నామస్మరణ చేశారు. ర్యాలీలో ఏనుగుపై అయ్యప్ప ఫొటోను పెట్టి ఊరేగింపు నిర్వహించారు. ర్యాలీలో కేరళ వాయిద్య కళాకారులు నృత్యాలు చేశారు. పరిగి రోడ్డు పోచమ్మ దేవాలయం నుంచి శివమారుతి గీతా అయ్యప్ప మందిరం వరకు విద్యుద్దీపాలతో అలంకరణ చేశారు. అనంతరం శివ మారుతి గీతా అయ్యప్ప మందిరంలో మహాపడిపూజ నిర్వహించారు.