భక్తిశ్రద్ధలతో సేవాలాల్‌ పడిపూజ

ABN , First Publish Date - 2022-09-25T05:53:48+05:30 IST

భక్తిశ్రద్ధలతో సేవాలాల్‌ పడిపూజ

భక్తిశ్రద్ధలతో సేవాలాల్‌ పడిపూజ
పడిపూజలో జడ్పీటీసీ దశరథ్‌నాయక్‌, నాయకులు

కడ్తాల్‌, సెప్టెంబరు 24: సాలార్‌పూర్‌లో గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్‌ మహరాజ్‌, మేరామయాడి పడిపూజ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఆలయాన్ని తోరణాలు, పుష్పాలతో అలంకరించారు. జడ్పీటీసీ జర్పుల దశరథ్‌ నాయక్‌ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరయ్యారు. మాలధారులు, భక్తులు, యువకు లు పడిపూజలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయ నుంచి సాయంత్రం వరకు పూజలు కొనసాగాయి. సేవాలాల్‌ మహరాజ్‌ మాలధారణ చేయడం ఆనందంగా ఉందని జడ్పీటీసీ పేర్కొన్నారు. సేవాలాల్‌, మేరిమాయాడి గొప్పతనాన్ని వివరించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ప్రియరమేశ్‌, సర్పంచ్‌ విజయలక్ష్మి, వార్డు సభ్యులు నాయకులు శ్రీను, భోజ్య, దశరథ్‌, యాదగిరిరెడ్డి, జైపాల్‌, శ్రీను, గోపాల్‌, జగన్‌, మాలధారులు, స్వాములు పాల్గొన్నారు. 

Read more