బస్తీ దవాఖాన ఏర్పాటు చేయండి
ABN , First Publish Date - 2022-11-06T23:54:35+05:30 IST
కడ్తాల మండలం గాన్గుమర్ల తండాలో బస్తీ దవాఖానను ఏర్పాటు చేయాలని స్థానిక సర్పంచ్ హంసమోత్యనాయక్ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావును కోరారు.
కడ్తాల్, నవంబరు 6: కడ్తాల మండలం గాన్గుమర్ల తండాలో బస్తీ దవాఖానను ఏర్పాటు చేయాలని స్థానిక సర్పంచ్ హంసమోత్యనాయక్ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావును కోరారు. ఆదివారం హైదరాబాద్‌లో మంత్రి నివాసంలో కలిసి తండా నాయకుడు మోత్యనాయక్, స్థానిక యువకులు వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి దవాఖాన ఏర్పాటుకు చేసిన సిఫారసు లేఖను మంత్రి హరీశ్‌రావుకు అందజేశారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించి వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశించినట్లు మోత్యనాయక్ తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో తండా యువకులు సక్రునాయక్, చందర్, వినోద్, శ్రీను, నవీన్, రవి, చరణ్ ఉన్నారు.