ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

ABN , First Publish Date - 2022-03-06T04:26:44+05:30 IST

ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత
శంషాబాద్‌ విమానాశ్రయంలో పట్టుబడిన బంగారం

శంషాబాద్‌ రూరల్‌, మార్చి 5: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. శనివారం ఉదయం దుబాయ్‌ నుంచి వచ్చిన ఎమిరేట్స్‌ ఈకే524 విమాన ప్రయాణికులను కస్టమ్స్‌ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో  ఓ వ్యక్తి లోదస్తుల్లో కడ్డీల రూపంలో ఉన్న 1.14కిలోల బంగారాన్ని గుర్తించారు. బంగారానికి సంబంధించిన బిల్లులు లేకపోవడంతో అతడిని అదుపులోకి తీసుకొని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ రూ.61.72లక్షలుంటుందని కస్టమ్స్‌ అధికారులు వెల్లడించారు.

Read more