స్కాలర్‌షిప్‌ బకాయిలను విడుదల చేయాలి

ABN , First Publish Date - 2022-12-15T00:27:12+05:30 IST

రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేయాలని విద్యార్థి జనసమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేరాల ప్రశాంత్‌, జిల్లా అధ్యక్షుడు ఏటెల్లి శేఖర్‌యాదవ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి మిడిదొడ్డి రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

స్కాలర్‌షిప్‌ బకాయిలను విడుదల చేయాలి

రంగారెడ్డి అర్బన్‌, డిసెంబర్‌ 14 : రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేయాలని విద్యార్థి జనసమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేరాల ప్రశాంత్‌, జిల్లా అధ్యక్షుడు ఏటెల్లి శేఖర్‌యాదవ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి మిడిదొడ్డి రామకృష్ణ డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌ అమయ్‌కుమార్‌కు బ టుధవారం వినతిపత్రం ఇచ్చారు. రెండేళ్లుగా ఫీజు బకాయిలను ప్రభుత్వం చెల్లించక కోర్సు పూర్తిచేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పీజు రియంబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ రూ. 3,300 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2022-12-15T00:27:13+05:30 IST