పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించాలి

ABN , First Publish Date - 2022-09-20T05:25:40+05:30 IST

పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించాలి

పాఠశాలల్లో స్కావెంజర్లను నియమించాలి
దారూరు: గడ్డమీది గంగారం పాఠశాలలో సభ్యత్వాలు అందజేస్తున్న పీఆర్‌టీయు నాయకులు

దారూరు/కులకచర్ల/పెద్దేముల్‌, సెప్టెంబరు 19: అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య పనివారిని నియమించాలని పీఆర్టీయూ జిల్లాఅధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌, ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు హెచ్‌.శివకుమార్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గడ్డమీది గంగారం ఉన్నత పాఠశాలలో సోమవారం యూనియన్‌ వార్షిక సభ్యత్వాలను ప్రారంభించి అందజేశారు. పాఠశాలల్లో స్కావెంజర్లు లేక స్కూళ్లలో పారిశుధ్య నిర్వహణ కష్టమవుతోందన్నారు. త్వరలోనే ఉపాధ్యాయలకు ప్రమోషన్లు, బదిలీలు జరుగుతాయని, ఇతర సమస్యలూ తీరుతాయని తెలిపారు. కార్యక్రమంలో యూనియన్‌ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు వెంకటయ్య, కార్యదర్శి యాదగిరి,శేఖర్‌, శ్రీనివాస్‌, మల్లికార్జున్‌, మాణిక్యం, మహేందర్‌, సత్యం, శ్రీనివాస్‌, సుధాకర్‌ పాల్గొన్నారు. కులకచర్ల మండల పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతామని పీఆర్‌టీ యూ టీఎస్‌ మండల అధ్యక్ష, కార్యదర్శులు వెంకటయ్య, దశరథ్‌ తెలిపారు. కుస్మసముద్రం, ఇప్పాయిపల్లి పాఠశాలలో సభ్యత్వ నమోదు చేయించారు. పీఆర్‌టీయూ మండల గౌరవాధ్యక్షుడు రాఘవేందర్‌రెడ్డి, రాష్ట్రఉపాధ్యక్షులు తావుర్యానాయక్‌, జిల్లా కార్యదర్శి మహేశ్‌, శివయ్య, వెంకటయ్య, క్రిష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పెద్దేముల్‌ మండలంలో పీఆర్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించింది. పెద్దేముల్‌, మంబాపూర్‌, మారేపల్లి, నకందనెల్లి పాఠశాలల్లో టీచర్లకు సభ్యత్వాలు అందజేశారు. జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌, గౌరవాధ్యక్షుడు వెంకట్‌రాంరెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షుడు శివకుమార్‌, రాష్ట్ర బాధ్యులు ద్యావరి నరేందర్‌రెడ్డి, విజయలక్ష్మి, మండల అధ్యక్షులు రాజశేఖర్‌, ప్రధాన కార్యదర్శి నవీన్‌కుమార్‌, జిల్లా, మండల బాధ్యులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Read more