డీసీసీ కార్యదర్శిగా సంగని జంగయ్య

ABN , First Publish Date - 2022-09-08T05:45:04+05:30 IST

డీసీసీ కార్యదర్శిగా సంగని జంగయ్య

డీసీసీ కార్యదర్శిగా సంగని జంగయ్య

వికారాబాద్‌, సెప్టెంబరు 7: డీసీసీ కార్యదర్శిగా మునిసిపల్‌ పరిధిలోని దన్నారం గ్రామానికి చెందిన సంగని జంగయ్య నియమితులయ్యారు. దీంతో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌ బుధవారం ఆయన నివాసంలో జంగయ్యను సన్మానించారు. జిల్లాలో అత్యధిక కాంగ్రెస్‌ సభ్యత్వాలు చేసిన జంగయ్యను ప్రోత్సహించేందుకు గాను ఈ పదవి వచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, సోషల్‌ మీడియా రాష్ట్ర కార్యదర్శి చామల రఘపతిరెడ్డి, జిల్లా బీసీ సెల్‌ కన్వీనర్‌ లక్ష్మణ్‌, పెండ్యాల అనంతయ్య, శ్రీనివాస్‌, వీరేష్‌, బందయ్య, రజినీకాంత్‌, రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.


Read more