సగరులు అన్ని రంగాల్లో రాణించాలి

ABN , First Publish Date - 2022-01-24T05:00:00+05:30 IST

సగరులు అన్ని రంగాల్లో రాణించాలి

సగరులు అన్ని రంగాల్లో రాణించాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఉప్పరి శేఖర్‌సాగర్‌

ఇబ్రహీంపట్నం, జనవరి 23: సగరులు అన్ని రంగాల్లో రాణించాలని సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్‌సాగర్‌, గౌరవ అధ్యక్షుడు హరికిషన్‌ అన్నారు. ఆసంఘం 5వ  కార్యవర్గ సమావేశం ఇబ్రహీంపట్నంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా సంఘం నూతన సంవత్సర క్యాలెండర్‌ను అవిష్కరించారు. అనంతరం నాలుగున్నర నెలల కాలంలో సంఘం చేసిన నివేదికను వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ సంఘం కోసం పనిచేయాలని, సంఘం చేపట్టిన ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. సగరుల కులగణన పైలెట్‌ ప్రాజెక్టు కింద పూర్తయిన నల్గొండ జిల్లా సంఘానికి రాష్ట్ర సంఘం శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గౌరక్క, కోశాధికారి పల్లవి సాగర, గ్రేటర్‌ అధ్యక్షులు రవిసాగర, గౌరవ అధ్యక్షులు వెంకటస్వామి, కోశాధికారి రాము, సంయుక్త కార్యదర్శి మహేందర్‌, సాయిగణేష్‌ పాల్గొన్నారు.  

Read more