పల్లె ప్రకృతి వనాల పనులను పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-12-31T00:04:23+05:30 IST

గ్రామాల్లో జరుగుతున్న పల్లె ప్రకృతి వనాల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా అడిషనల్‌ డీఆర్డీవో స్టీవన్‌లీ అన్నారు. శుక్రవారం మోమిన్‌పేట్‌ ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందికి పనులపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

పల్లె ప్రకృతి వనాల పనులను పూర్తి చేయాలి
భూమి సర్వే చేస్తున్న జిల్లా సర్వేయర్‌ రాంరెడ్డి, సర్వేయర్లు

మోమిన్‌పేట్‌, డిసెంబరు 30: గ్రామాల్లో జరుగుతున్న పల్లె ప్రకృతి వనాల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా అడిషనల్‌ డీఆర్డీవో స్టీవన్‌లీ అన్నారు. శుక్రవారం మోమిన్‌పేట్‌ ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందికి పనులపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గోవిందాపూర్‌లో పల్లె ప్రకృతి వనం పనులను ఎంపీడీవో శైలజారెడ్డితో కలిసి పరిశీలించారు. గ్రామ నర్సరీలు, పల్లె ప్రకృతి వనం, ప్రాంగణాలను త్వరగాపూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీవో యాదగిరి, ఏపీఎం శంకరయ్య, నర్సిములు, మహిపాల్‌రెడ్డి, వెంకటయ్య, సుగుణ, మాధవి, ప్రవీణ్‌, జగన్‌, ఫిరోజ్‌ఖాన్‌, వెంకటేశ్‌, గంగయ్య, ఎల్లయ్య, రాములు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T00:04:24+05:30 IST