ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ

ABN , First Publish Date - 2022-11-30T00:24:29+05:30 IST

ఎదురుగా వస్తున్న ఆటో ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది.

ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ

ముగ్గురికి స్వల్ప గాయాలు

ధారూరు, నవంబరు 29: ఎదురుగా వస్తున్న ఆటో ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది. తాండూరు నుంచి హైదరాబాద్‌ వెళుతున్న ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌ బస్సు ధారూరు దాటిన తర్వాత పెట్రోల్‌ బంక్‌ వద్ద ధారూరు వైపు వస్తున్న ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఆర్టీసీ బస్సును పోలీసుస్టేషన్‌కు తరలించారు. కాగా, ప్రమాదంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ నరేందర్‌ తెలిపారు.

Updated Date - 2022-11-30T00:24:29+05:30 IST

Read more