రోడ్డు వెడల్పును కుదించాలి

ABN , First Publish Date - 2022-10-12T05:16:06+05:30 IST

రోడ్డు వెడల్పును కుదించాలి

రోడ్డు వెడల్పును కుదించాలి
హెచ్‌ఎండీఏ ఆధికారులకు రాసిన లేఖను చంద్రారెడ్డికి ఇస్తున్న మంత్రి మల్లారెడ్డి

కీసర రూరల్‌, అక్టోబరు 11 : నాగారంలోని రాంపల్లి చౌరస్తా నుంచి ఘట్‌కేసర్‌ వైపు వెళ్లే మార్గంలోని సర్వేనంబర్‌ 421(హెచ్‌పీ పెట్రోల్‌ పంపు) వరకు మాస్టర్‌ ప్లాన్‌లో పేర్కొన్న రోడ్డు వెడల్పును 200 ఫీట్ల నుంచి 100కు తగ్గించాలని నాగారం మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రారెడ్డి గతంలో చేసిన వినతిపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. స్థానికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, 200 ఫీట్ల రోడ్డును 100కు కుదించాలని కోరుతూ మంత్రి హెచ్‌ఎండీఏ ఆధికారులకు లేఖ రాసారు. ఆ లేఖను మంగళవారం చైర్మన్‌ చంద్రారెడ్డి, కౌన్సిలర్‌ బిజ్జ శ్రీనివాసులకు అందజేసారు. స్థానికుల వినతికి కృషి చేస్తున్న మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.


Read more