-
-
Home » Telangana » Rangareddy » Riots are due to incompetence of the government-NGTS-Telangana
-
ప్రభుత్వ అసమర్థత వల్లే అల్లర్లు
ABN , First Publish Date - 2022-08-31T05:40:57+05:30 IST
ప్రభుత్వ అసమర్థత వల్లే అల్లర్లు

చేవెళ్ల, ఆగస్టు 30: రాష్ట్ర ప్రభుత్వం అసమర్థతతోనే అల్లర్లు జరుగుతున్నాయని బజరంగ్‌ధళ్ విభాగ్ జిల్లా కో కన్వీనర్ గూడెం రమేశ్, బీజేపీ చేవెళ్ల మండల అధ్యక్షుడు దేవర పాండురంగారెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి అనంత్‌రెడ్డి అన్నారు. చేవెళ్ల మండల కేంద్రంలో మంగళవారం బీజేపీ, బీజేవైఎం, భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించి సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. దేశంలోని 16రాష్ట్రాల్లో మునావర్ షోలను నిషేధించినా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇచ్చిందని ప్రశ్నించారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు బోజిరెడ్డి, నాయకులు రమేశ్, సురేశ్, రామ్‌రెడ్డి, బాబు, శ్రీనివా్‌సరెడ్డి, సత్యనారాయణ, ఆశోక్, సందీఫ్, శ్రీకాంత్ ఉన్నారు.