అధర్మ పాలనపై ధర్మపోరాటం : పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-10-07T05:46:13+05:30 IST

అధర్మ పాలనపై ధర్మపోరాటం : పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి

అధర్మ పాలనపై ధర్మపోరాటం : పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి
మాట్లాడుతున్న పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి

బొంరాస్‌పేట్‌, అక్టోబరు 6 : నాడు అధర్మ పాలనపై పాండవులు సాధించిన ధర్మపోరాటం ఫలితంగా నేడు విజయదశమి వేడుకలు జరుపుకుంటున్నామని,  నేడు బీఆర్‌ఎస్‌ (టీఆర్‌ఎస్‌) అధర్మ పాలనపై కాంగ్రెస్‌ ధర్మపోరాటం చేస్తూ.. త్వరలోనే అధికారంలోకి వస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం రాత్రి దుద్యాల్‌ మండల కేంద్రంలో కాంగ్రెస్‌ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన కార్యకర్తలనుద్ధేశించి మాట్లాడారు. కార్యకర్తలు అధైర్యపడొద్దని త్వరలో వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని, దుష్టపాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయన్నారు. టీఆర్‌ఎస్‌ నుంచి బీఆర్‌ఎస్‌కు మారినా... త్వరలో వీఆర్‌ఎస్‌ తప్పదన్నారు. నాయకులు ఎ.తిరుపతిరెడ్డి, నర్సిములుగౌడ్‌, జయకృష్ణ, రాజేశ్‌రెడ్డి, వెంకటయ్య, శేఖర్‌, తన్వీర్‌, కిష్టప్ప, వీరేశం, పెంటప్ప తదితరులు పాల్గొన్నారు.


Read more