ప్రాథమిక పాఠశాల పునఃప్రారంభం
ABN , First Publish Date - 2022-10-18T05:21:44+05:30 IST
ప్రాథమిక పాఠశాల పునఃప్రారంభం
చౌదరిగూడ, అక్టోబర్ 17: ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి మండలంలోని దామరగిద్ద పాఠశాల మూతబడి ఉంది. దీంతో పాఠశాల మూతపడడంపై విద్యాశాఖ అధికారులు ఫిర్యాదులపై స్పందించారు. సోమవారం పాఠశాలను సందర్శించి మూతపడటానికి గల కారణాలను తెలుసుకుని తిరిగి పాఠశాలను తెరిపించారు. ఉన్న ఒక్క ఉపాధ్యాయురాలు డిప్యూటేషన్‌పై వెళ్తుతున్న విషయాన్ని గమనించి ఆమె డిప్యూటేషన్‌ను రద్దు చేశారు. విధిగా పాఠశాలకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసి పాఠశాలను పునఃప్రారంభించారు.