సీసీఐ కర్మాగారంలో మరమ్మతులు పూర్తి

ABN , First Publish Date - 2022-07-07T05:30:00+05:30 IST

సీసీఐ కర్మాగారంలో మరమ్మతులు పూర్తి

సీసీఐ కర్మాగారంలో మరమ్మతులు పూర్తి
సీసీఐ కర్మాగారం

  • నేటి నుంచి సిమెంటు ఉత్పత్తులు ప్రారంభం

తాండూరు రూరల్‌, జూలై 7: తాండూరు మండలం కరన్‌కోట్‌ సీసీఐ కర్మాగారంలో 12రోజుల క్రితం నిలిచిపోయిన క్లింకర్‌ ఉత్పత్తి తిరిగి ప్రారంభమైంది. కర్మాగారం లోని కిలాన్‌ సెక్షన్‌, కోల్‌మిల్లు సెక్షన్‌లో చిన్న చిన్న మరమ్మతుల వల్ల 12 రోజులుగా సీసీఐ కర్మా గారంలో మరమ్మతుల పేరిట క్లింకర్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. అదేవిధంగా కిలాన్‌ సెక్షన్‌లో ప్యాచ్‌వర్క్‌ పనులు, కోల్‌మిల్లు సెక్షన్‌లో బేరింగ్‌లో మరమ్మతు పనులు పూర్తిచేశారు. దీంతో సీసీఐ కర్మాగారంలోని యంత్రాలన్నింటికీ మరమ్మతు పనులు పూర్తయ్యాయి. అయితే సిమెంటు ముడి సరుకును 1500 డిగ్రీల సెంటీగ్రేడ్‌లలో వేడిచేస్తే సిమెంటు తయారవుతుందన్నారు. నేటినుంచి సిమెంటు ఉత్పత్తులు ప్రారంభం కానున్నాయి. 

Read more