జాతీయ పతాకావిష్కరణలో నిబంధనలు పాటించాలి

ABN , First Publish Date - 2022-08-10T05:48:58+05:30 IST

జాతీయ పతాకావిష్కరణలో నిబంధనలు పాటించాలి

జాతీయ పతాకావిష్కరణలో నిబంధనలు పాటించాలి

మేడ్చల్‌ అర్బన్‌, ఆగస్టు 9: స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా పతాకావిష్కరణ సమయంలో నియమ, నిబంధనలు పాటించాలని మేడ్చల్‌ ఇన్‌చార్జి కలెక్టర్‌ హరీశ్‌ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే సమయంలో జెండాను అగౌరవపరిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. సూర్యోదయం, సూర్యాస్తమయం మధ్యలో మాత్రమే జెండా ఆవిష్కరణ, అవనతం జరగాలని చెప్పారు. భారతీయ చట్టం ప్రకారం త్రివర్ణ పతాకాన్ని గౌరవంగా, విధేయతతో చూడాలని పేర్కొన్నారు. జెండాను ఎగురవేసే సమయంలో వేగంగా, అవనతం సమయంలో నెమ్మదిగా దించాలన్నారు. ఇతర జెండాలతో కలిపి జాతీయ పతాకాన్ని ఎగురవేసే సమయంలో త్రివర్ణ జెండా అన్నింటికంటే ఎత్తులో ఉండేలా చూసుకోవాలన్నారు. పతాకంలో పైన కాషాయం, మధ్యలో తెలుపు, దిగువ భాగంలో ఆకుపచ్చరంగు ఉండాలని, జెండా ఎప్పుడూ నిటారుగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్‌ స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సంకల్పించారని, అన్నారు. జాతీయ జెండాపై ఎలాంటి అక్షరాలు రాయకూడదని, ఇతర రంగులు అద్దకూడదని సూచించారు. త్రివర్ణ పతాకాన్ని ఉద్దేశపూర్వకంగా తలకిందులుగా ఎగురవేయడం, ద్రవ పదార్థాల్లో ముంచడంలాంటి పనులు చేస్తే చట్టప్రకారం కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని కలెక్టర్‌ హెచ్చరించారు. 

Updated Date - 2022-08-10T05:48:58+05:30 IST