రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు
ABN , First Publish Date - 2022-08-04T05:58:31+05:30 IST
రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు
- డీసీఎంఎస్ చెర్మన్
చేవెళ్ల, ఆగస్టు 3: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రికార్డుస్థాయిలో రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేశాం అని జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్) చైర్మెన్ పి.కృష్ణారెడ్డి తెలిపారు. బుధవారం చేవెళ్లలో డీసీసీబీ బ్రాంచ్‌లో ఆయన విలేకరుతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి రికార్డులో స్థాయిలో యాసంగి వడ్లు, శనిగలు కొందని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో 4లక్షల 86వేల 612క్వింటాళ్ల వడ్లు కొన్నామన్నారు. వాటికి గాను రైతులకు రూ.95.37కోట్లు చెల్లించామన్నారు. క్వింటాలుకు రూ.1,920 చొప్పున కొనుగోలు చేశామన్నారు. వడ్లతోపాటు శనిగలు క్వింటాలకు రూ.5,320కి తాండూర్, శంకర్‌పల్లి, పరిగి సెంటర్లల్లో 13,190 క్వింటాళ్లు కొనుగోలు చేశామన్నారు. డీసీఎంఎస్ ప్రస్తుతం లాభాల్లో ఉందన్నారు. రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు మాధవ్‌గౌడ్ ఉన్నారు.