రాజీవ్‌గాంధీ సేవలు మరువలేనివి

ABN , First Publish Date - 2022-08-21T05:57:36+05:30 IST

రాజీవ్‌గాంధీ సేవలు మరువలేనివి

రాజీవ్‌గాంధీ సేవలు మరువలేనివి
రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి

రంగారెడ్డి అర్బన్‌, ఆగస్టు 20: రాజీవ్‌గాంధీ దేశానికి చేసిన సేవలు మరువలేనివని డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి అన్నారు. జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో శనివారం రాజీవ్‌గాంధీ 78వ జయంతి వేడుకలను నిర్వహించారు. రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ రాజీవ్‌గాంధీ లేని లోటు ఎప్పటికీ తీరనిదన్నారు. బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు అమలుచేసిన ఘనత రాజీవ్‌గాంధీకే దక్కిందన్నారు. కంప్యూటర్‌, మొబైల్‌ వంటి ఎలక్ర్టానిక్‌ టెక్నాలజీని దేశానికి తెచ్చారని గుర్తుచేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు దేవగోని కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటే ష్‌గౌడ్‌, కార్పొరేటర్లు బాల్‌రెడ్డి, సిద్ధాల శ్రీశైలం, విజయవర్ధన్‌రెడ్డి, నాయకులు కీసర యాదిరెడ్డి, మారెపల్లి రమేష్‌, సురేందర్‌రెడ్డి, సుభా్‌షరెడ్డి, ఐత రాజు, భాస్కర్‌, సోషల్‌ మీడియా కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు.

Read more