రజక సంఘం నూతన కార్యవర్గం
ABN , First Publish Date - 2022-09-26T05:39:38+05:30 IST
రజక సంఘం నూతన కార్యవర్గం
తలకొండపల్లి, సెప్టెంబరు 25: తలకొండపల్లి గ్రామ రజక సంఘం నూతన కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రజక సంఘం మండల అధ్యక్షుడు బొమ్మరాజు నర్సింహ, ప్రధాన కార్యదర్శి కందుకూరి కృష్ణయ్యల అధ్యక్షతన సమావేశమై నూతన కమిటీని ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా కందుకూరి మహేశ్, ఉపాధ్యక్షులుగా కందుకూరి శేఖర్, ప్రధాన కార్యదర్శిగా ఉపునూంతల జంగయ్య, ప్రచార కార్యదర్శిగా మిర్యాల శ్రీను, కార్యదర్శులుగా సోమరాజు రాములు, బోమ్మరాజు సత్యం, కోశాధికారిగా ఉప్పునూంతల రవి, సభ్యులుగా కృష్ణయ్య, రమేశ్, రాజు, నరేశ్, వెంకటయ్య, యాదయ్య, శ్రీరాములు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.