ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్త్తే విమర్శలా?

ABN , First Publish Date - 2022-12-13T23:55:05+05:30 IST

ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అనవసర విమర్శలెందుకని ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఎడమ నరేందర్‌రెడ్డి, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు వింజమూరి రాంరెడ్డి బీఆర్‌ఎస్‌ నాయకులను ప్రశ్నించారు.

ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్త్తే విమర్శలా?

ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఎడ్మ నరేందర్‌రెడ్డి

మంచాల, డిసెంబరు 13: ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అనవసర విమర్శలెందుకని ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఎడమ నరేందర్‌రెడ్డి, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు వింజమూరి రాంరెడ్డి బీఆర్‌ఎస్‌ నాయకులను ప్రశ్నించారు. మంగళవారం వారు మంచాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 13ఏళ్లుగా ఎమ్మెల్యే వందల కోట్లు అక్రమంగా సంపాదించారని, ఈ సంపాదనంతా బంగారు గనుల్లో పెట్టుబడులు పెట్టారని వారు ఆరోపించారు. మల్‌రెడ్డి రంగారెడ్డిని విమర్శించే అర్హత బీఆర్‌ఎస్‌ నాయకులకు లేదన్నారు. సమావేశంలో ఎంపీటీసీ జయానందం, రాందాసు, మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాజు, సురేష్‌, జైపాల్‌రెడ్డి, వెంకటేష్‌, కృష్ణ, శ్రీకాంత్‌, లింగంగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T23:55:05+05:30 IST

Read more