30,682 బస్తాల ధాన్యం కొనుగోళ్లు
ABN , First Publish Date - 2022-12-16T23:22:54+05:30 IST
చెంగోల్, అల్లాపూర్ గ్రామాల్లో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఇప్పటి వరకు 236 మంది రైతుల నుంచి 30,682 బస్తాల వడ్లు కొన్నామని కేంద్రం ఇన్‌చార్జి ఎల్లప్ప తెలిపారు.
తాండూరు రూరల్, డిసెంబరు, 16: చెంగోల్, అల్లాపూర్ గ్రామాల్లో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఇప్పటి వరకు 236 మంది రైతుల నుంచి 30,682 బస్తాల వడ్లు కొన్నామని కేంద్రం ఇన్‌చార్జి ఎల్లప్ప తెలిపారు. గత నెల 24న కేంద్రాలను ప్రారంభించి కొనుగోళ్లు చేస్తున్నామన్నారు. రైతులు నాణ్యమైన వడ్లు తీసుకురావాలని కోరారు.