ప్రజా సంక్షేమమే కేసీఆర్‌ ధ్యేయం

ABN , First Publish Date - 2022-10-07T05:48:21+05:30 IST

ప్రజా సంక్షేమమే కేసీఆర్‌ ధ్యేయం

ప్రజా సంక్షేమమే కేసీఆర్‌ ధ్యేయం
పింఛన్లు అందిస్తున్న శ్రీనివాస్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి

మోమిన్‌పేట్‌, అక్టోబరు 6: ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు డాకూరి శ్రీనివాస్‌రెడ్డి, మోమిన్‌పేట్‌ సోసైటి చైర్మన్‌ బండ విష్ణువర్ధన్‌రెడ్డిలు అన్నారు. గురువారం మండల పరిధిలోని టేకులపల్లి గ్రామ రైతు వేదికలో 57 సంవత్సరాలు నిండిన 144 మంది లబ్ధిదారులకు ఆసరా పింఛన్‌లు ఒక్కొక్కరికి రూ.2016 చొప్పున అందించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నీ వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ రైస్‌, వార్డు సభ్యులు రాములు, రాజు, నాయకులు పురుషోత్తం, నారాయణ,. శంకర్‌, మల్లయ్య, నర్సిములు తదితరులు పాల్గొన్నారు. 


Read more