దివ్యాంగ మహిళలకు కుట్టు మిషన్లు అందజేత

ABN , First Publish Date - 2022-12-16T23:20:03+05:30 IST

దివ్యాంగుల అభివృద్ధికి తమవంతు కృషిచేస్తున్నామని రాజమాత ఫౌండేషన్‌ అధ్యక్షుడు ఉదయ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

దివ్యాంగ మహిళలకు కుట్టు మిషన్లు అందజేత

ఘట్‌కేసర్‌, డిసెంబరు16: దివ్యాంగుల అభివృద్ధికి తమవంతు కృషిచేస్తున్నామని రాజమాత ఫౌండేషన్‌ అధ్యక్షుడు ఉదయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం అన్నోజిగూడ సమీప దివ్యాంగుల కాలనీకి చెందిన ఇద్దరు దివ్యాంగ మహిళలకు రెండుకుట్టు మిషన్లును ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజమాత ఫౌండేషన్‌ పేదలకు సాయం చేసేం దుకు ముందుంటుదన్నారు. ఇటివల ఇదే కాలనీలో 225మంది దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ చేశామన్నారు. సాయం చేసే ందుకు తమ ఫౌండేషన్‌ నిరంతరం పాటుపడుతుందన్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు ఉదయ్‌కుమార్‌రెడ్డిని సన్మాంనించారు. కార్యక్రమంలో ఫౌండేషన్‌ సభ్యులు మనోజ్‌కుమార్‌రెడ్డి, సంతో్‌షరెడ్డి, పాండు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:20:04+05:30 IST