ఘనంగా విక్టరీ డే
ABN , First Publish Date - 2022-05-26T05:16:15+05:30 IST
ఘనంగా విక్టరీ డే
కేశంపేట, వే 25: సాంఘిక సంక్షేమ గురుకులంలో చదువుకున్న మలావత్ పూర్ణ, ఆనంద్ 2014 సంవత్సరం మే 25న ఎవరెస్ట్ శిఖ రాన్ని అధిరోహించిన సందర్భాన్ని పురస్కరించుకొని స్వేరోస్ మే 25ను విక్టరీ డే నిర్వహిస్తోంది. కాకునూర్ స్వేరోస్ సర్కిల్ ఆధ్వర్యంలో బుధవారం విక్టరీ డేను జరుపుకున్నారు. స్వేరోస్ సభ్యులు, విద్యార్థులతో కలిసి గ్రామం నుంచి 5కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండారెడ్డిపల్లికి నడుచుకుంటూ వెళ్లారు. అక్కడ అంబేడ్కర్, ఆర్ఎస్. ప్రవీణ్‌కుమార్ చిత్రపటాలతో గుట్టపై స్వేరో జెండాను ఎగురవేశారు. ఎన్ని కష్టాలు ఎదురైనా లక్ష్యంవైపే నడవాలని స్వేరో కమాండర్లు సూచించారు. ప్రతీ యేటా విక్టరీ డేను జరుపుకుంటున్నట్లు తెలిపారు. కమాండర్లు మల్లేష్, చంద్రయ్య, నాగేశ్ పాల్గొన్నారు.