తెలంగాణలో మహిళలకు రక్షణ కరువు
ABN , First Publish Date - 2022-12-07T23:27:19+05:30 IST
లైంగిక వేధింపులు, అక్రమ రవాణాలో తెలంగాణ రాష్ట్రం తొలిస్థానంలో ఉండటం బాధాకరమని టీడీపీ తెలుగు మహిళా విభాగం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మంకు ఇందిర అన్నారు.
టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళా విభాగం ఆర్గనైజింగ్ సెక్రటరీ మంకు ఇందిర
రంగారెడ్డి అర్బన్, డిసెంబరు 7 : లైంగిక వేధింపులు, అక్రమ రవాణాలో తెలంగాణ రాష్ట్రం తొలిస్థానంలో ఉండటం బాధాకరమని టీడీపీ తెలుగు మహిళా విభాగం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మంకు ఇందిర అన్నారు. మహిళల భద్రతకు అత్యున్నత స్థాయి మానిటరింగ్ కమిటీని నియమించాలని బుఽధవారం జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్‌జైన్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఇందిర మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కరువైందన్నారు. ప్రతీరోజు ఏదో ఒకచోట అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. విచ్చలవిడి మద్యం, గంజాయి అమ్మకాలు పెట్రేగిపోయాయని.. డ్రగ్స్, పబ్ సంస్కృతి ప్రబలిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం టీడీపీ ఇన్‌చార్జి చక్రపాణి, మున్సిపల్ అధ్యక్షుడు రాంరెడ్డి, తుర్కయంజాల్ మున్సిపల్ అధ్యక్షుడు వీరేశం, స్వప్న, మల్లమ్మ, శ్యామల తదితరులున్నారు.