అనారోగ్యంతో ఖైదీ మృతి

ABN , First Publish Date - 2022-09-10T05:56:14+05:30 IST

అనారోగ్యంతో ఖైదీ మృతి

అనారోగ్యంతో ఖైదీ మృతి

పరిగి, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : వికారాబాద్‌ జిల్లా పరిగి సబ్‌ జైలులో ఓ ఖైదీ అనారోగ్యంతో మృతిచెందాడు. పరిగి ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. నగరంలోని గాంధీనగర్‌కు చెందిన టి.రమేశ్‌బాబు(70) వికారాబాద్‌ జిల్లా పూడూరు మండలం చన్‌గోముల్‌ పీఎస్‌ పరిధిలో 2020లో క్రైం నంబర్‌ 94/20 కింద ఓ హత్య కేసులో రిమాండ్‌ అయ్యారు. ఏడాది క్రితం ఆనారోగ్యం(హెర్నియా)తో ఇబ్బందిపడగా చర్లపల్లి సెంట్రల్‌ జైలుకు తరలించారు. చికిత్స అనంతరం పరిగి సబ్‌ జైలుకు తీసుకొచ్చారు. అయితే, హత్య కేసులో భాగంగా గురువారం పరిగి కోర్టులో హాజరుపరిచి తిరిగి జైలుకు పంపించగా.. పరిగి జైలులోని 103వ నెంబర్‌ గదిలో గురువారం రాత్రి నిద్రించాడు. శుక్రవారం ఉదయం జైలు సిబ్బంది రమేశ్‌బాబును గమనించగా అచేతనంగా పడి ఉన్నాడు. దీంతో వెంటనే అతడిని పరిగి ప్రభుత్వాసుస్పత్రికి తరలించారు. అప్పటికే రమేశ్‌బాబు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. జైలు సూపరింటెండెంట్‌ సీహెచ్‌ రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


Read more