వైకుంఠధామాల నిర్మాణానికి ప్రాధాన్యం
ABN , First Publish Date - 2022-12-31T00:00:34+05:30 IST
రాష్ట్రవ్యాప్తంగా వైకుంఠధామాల నిర్మాణం చేపట్టి, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి
మహేశ్వరం, డిసెంబరు 30 : రాష్ట్రవ్యాప్తంగా వైకుంఠధామాల నిర్మాణం చేపట్టి, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం తుక్కుగూడ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో రూ.44 లక్షల వ్యయంతో వైకుంఠ ధామాల అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ న్యూఇయర్ సందర్భంగా నన్ను కలవడానికి వచ్చేవారు బొకేలకు బదులు విద్యార్థులకు అవసరమైన నోట్‌బుక్స్, స్టడీ, స్టేషనరీ మెటీరియల్ తీసుకురావాలని సూచించారు. మంత్రి సూచన మేరకు 7వవార్డు కౌన్సిలర్ బూడిద తేజస్విని శ్రీకాంత్‌గౌడ్ మంఖాల్ అంగన్‌వాడీ పాఠశాలను రూ.84 వేలతో సుందరీకరించడంతో వారిని అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కాంటేకార్ మధుమోహన్, వైస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్లు సుమన్, రవి, సప్పిడి లావణ్యరాజు, బాకి విలాస్, కె. పద్మశివయ్య, మున్సిపల్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు జెల్లల లక్ష్మయ్య, సామేల్‌రాజు, రామకృష్ణ, మల్లేష్, శివశంకర్, హరికృష్ణారెడ్డి, కమిషనర్ వెంకట్‌రామ్ పాల్గొన్నారు.