ఉత్తమ సేవా అవార్డుల ప్రదానం

ABN , First Publish Date - 2022-08-16T06:00:09+05:30 IST

ఉత్తమ సేవా అవార్డుల ప్రదానం

ఉత్తమ సేవా అవార్డుల ప్రదానం

చేవెళ్ల/షాబాద్‌/షాద్‌నగర్‌ అర్బన్‌/కొందుర్గు/కొత్తూర్‌/ ఆమనగల్లు/ యాచారం/మహేశ్వరం, ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తమ సేవా అవార్డులను మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేతుల మీదుగా అందజేశారు. చేవెళ్ల మండల వ్యవసాయ విస్తరణ అధికారి రమేశ్‌కు, షాబాద్‌ ఎంపీడీవో అనురాధ, డిప్యూటీ తహసీల్దార్‌ క్రాంతికుమార్‌ అవార్డు అందుకున్నారు. అదేవిధంగా షాద్‌నగర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ జయంత్‌కుమార్‌రెడ్డి, ఫరూఖ్‌నగర్‌ మండల వ్యవసాయాధికారి నిశాంత్‌కుమార్‌, కొందుర్గు శ్రీ లక్ష్మీనర్సింహ్మాస్వామి ఆలయ ఈవో నరేందర్‌ కొత్తూర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో పనిచేస్తున్న అటెండర్‌ విండకోటి పవన్‌ అవార్డులు అందుకున్నారు. అదేవిధంగా ఆమనగల్లు పట్టణానికి చెందిన విజిలెన్స్‌ సీఐ గజ్జ చలమందరాజు రాష్ట్ర స్థాయిలో పోలీసు ఉత్తమ సేవ పథకం లభించింది. రాష్ట్ర విజిలెన్స్‌ డైరెక్టర్‌ ఏరుసింగ్‌ మేరు నుంచి హైదారాబాద్‌లో చలమందరాజు అవార్డు అందుకున్నారు. కడ్తాల మండలం మైసిగండికి చెందిన మహేశ్వరం తహసిల్దార్‌ ఆర్‌పీ జ్యోతి మంత్రి సబితారెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. యాచారం మండల ఉపాధిహామీ పథకం ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్‌ శివశంకర్‌రెడ్డి. రెవెన్యూ కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ సుజిత్‌రెడ్డిలు అవార్డు అందుకున్నారు.  

Read more